విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో బోధన విధానం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల పాఠ్యంశాల్లోని సిలబస్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి...