navageetam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 12:25 am Digital Edition : NAVAGEETAM

విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ పెన్నులు పంపిణీ

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం వి.వి.రావుపేట్ ప్రభుత్వ పాఠశాలలో బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్ ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సామాజిక సేవలకు ముందుకు రావాలని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నులు ఇవ్వడం ద్వారా ప్రభావితం అయ్యి మరింత యువత సేవలకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి యువత కృషి చేయాలని ప్రభుత్వ పాఠశాలలా ద్వార విద్యాభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో మధ్య తరగతి విద్యార్థుల చదువు కోసం వారి కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడతారని వారి కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని కష్టపడి చదివి అత్యున్నత మార్కులు సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బి జె వై యం జిల్లా ఉపాధ్యక్షుడు బైన ప్రశాంత్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దత్తాత్రి, ఉపాద్యాయులు, యువకులు తదితరులు పాల్గొన్నారు