విద్యుత్ సిబ్బంది సేవలు అమోఘం
16వ వార్డు కౌన్సిలర్ కృతజ్ఞతలు నవగీతం, కోరుట్ల ప్రతినిధి : కోరుట్ల పట్టణంలో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా కురిసిన గాలివాన, ఉరుములు, మెరుపుల బీభత్సానికి 16వ వార్డులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భీకరమైన గాలుల ధాటికి విద్యుత్ తీగల్లో సమస్య ఏర్పడి వార్డు ప్రజలకు విద్యుత్ సరఫరా ఆగిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.దీనిపై 16వ వార్డు కౌన్సిలర్ పొట్ట సురేందర్ తక్షణమే స్పందించి, కోరుట్ల విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించారు. వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకున్న...