విద్య, వైద్యం,ఆర్థిక సహాయమే లక్ష్యంగా నిత్యసాయి ట్రస్ట్ సేవలు:
చైర్మన్ డాక్టర్ రఘు కోరుట్లలో నిత్యసాయి ట్రస్ట్ కార్యాలయం ప్రారంభం నవగీతం,కోరుట్ల పేద ప్రజలకు విద్య, వైద్యం, ఆర్థిక సహాయమే లక్ష్యంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో సేవా రంగానికి మరో మైలురాయిగా నిలిచేలా నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ప్రారంభమైంది. పట్టణంలోని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయాన్ని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ సమాజంలో విద్యాపరంగా, ఆర్థికంగా...