navageetam.com
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 2:06 pm Digital Edition : NAVAGEETAM

విన్నర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమి వేడుకలు

వగీతం,కొడిమ్యాల

కొడిమ్యాల మండల కేంద్రంలోని విన్నర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వసంత పంచమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం పసుపు రంగు అలంకరణలు, పూలతో శోభాయమానంగా మారింది. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.వసంత పంచమి సందర్భంగా విద్యా దేవత శ్రీ సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, వసంత పంచమి మన సంస్కృతి, విద్యకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేసే గొప్ప పండుగ అని, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.