navageetam.com
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 10:21 am Digital Edition : NAVAGEETAM

విన్నర్స్ ఇంగ్లీష్ స్కూల్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవం

నవగీతం, కొడిమ్యాల:

కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక విన్నర్స్ ఇంగ్లీష్ స్కూల్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ సైన్స్ మోడల్స్, ప్రయోగాలు, ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉత్పత్తి, అంతరిక్ష పరిశోధన వంటి అంశాలపై విద్యార్థులు సృజనాత్మకతతో తయారు చేసిన నమూనాలు విశేషంగా ప్రశంసలు అందుకున్నాయి.విజ్ఞానానికి సంబంధించిన తమ ప్రతిభను విద్యార్థులు సమర్థంగా ప్రదర్శించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద్ మాట్లాడుతూ, విజ్ఞానం మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.విద్యార్థులు శాస్త్రవేత్తల మాదిరిగా ఆలోచిస్తూ, పరిశోధనాత్మక దృక్పథంతో కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు.