విశాఖ సాగర తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
ఆకట్టుకున్న భారత నేవీ బృందం ప్రదర్శన విన్యాసాలు. నవగీతం, విశాఖపట్నం: విశాఖపట్నం సాగర తీరంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా బుధవారం ఉదయం ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కలిసి పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐ ఎన్ ఎస్ సుమేధ లో ప్రయాణిస్తూ, భారత నేవీ బృందం ప్రదర్శిస్తున్న విన్యాసాలను తిలకించారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ...