వెంకటాపురంలో మండల మహిళా సమాఖ్య 18వ వార్షిక మహాజనసభ
నూగురు వెంకటాపురం,సెప్టెంబర్ 30,(నవగీతం)ములుగు జిల్లా వెంకటాపురం మండలకేంద్రంలో మహిళా సమాఖ్య 18వ వార్షిక మహాజనసభ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్, డీఆర్డీఏ ద్వారా చేపట్టే ప్రగతి నివేదికపై సమీక్షించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, 2026-27 చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.2025-26 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, సామాజిక పెట్టుబడి నిధి (సీఐఎఫ్) ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేసింది. దీని ద్వారా సంఘ...