వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభివృద్ధి,సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తా.. డా.రఘు.
నవగీతం,మెట్ పల్లి వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ రఘు అన్నారు.జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షులుగా మెట్ పల్లి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ చిట్నేని రఘు నియామకం అయినట్లు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమండ్ల మహేష్ బుధవారం తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి, అదేవిధంగా జిల్లాలో యువ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి డాక్టర్ రఘు కృషి చేస్తారని పేర్కొంటూ ఈ నియామకం జరిపినట్లు తెలిపారు. జిల్లాలో వెయిట్...