వెల్లుల్లలో బడిబాట కార్యక్రమం

నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి మండల కేంద్రంలోనీ వెల్లుల గ్రామంలో విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ బడిబాట కార్యక్రమాన్ని స్థానిక అధికారులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చిన్నారులను పాఠశాలలో చేర్పించేందుకు అవగాహన ర్యాలీ చేపట్టారు.గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొని “ప్రతి బాలుడు పాఠశాలకు – మంచి భవిష్యత్తుకు మార్గం” అనే నినాదాలు చేశారు. తల్లిదండ్రులకు విద్య అవసరాన్ని వివరించి, పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు.ఈ సందర్భంగా...