వేగంతో ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడు మృతి

ఆటో దిగిన క్షణాల్లోనే విషాదం నవగీతం, మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని నడికుడ గ్రామ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు–గౌతమి దంపతుల కుమారుడు వేదన్ష్ (4) ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే...నాగరాజు దంపతులు తమ కుమారుడితో కలిసి వాల్గొండ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా నడికుడ వద్ద ఆటో నుంచి దిగిన అనంతరం రోడ్డును దాటే క్రమంలో రాఘవపేట నుండి...