navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 10:00 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వేములవాడలో ఘనంగా మారుతిసాగర్ జన్మదిన వేడుకలు

భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

పేదలకు అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ

నవగీతం, వేములవాడ: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-హెచ్ 143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జన్మదిన వేడుకలను బుధవారం వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మారుతి సాగర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో పేదలకు అన్నదానం చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగామహమ్మద్ రఫీక్ మారుతి సాగర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మారుతి సాగర్ కృషి ఎనలేనిదని, పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో జర్నలిస్టులకు మరింత సేవ చేయాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం భాస్కర్ రెడ్డి, మాకాసి కార్తీక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.