వేములవాడలో ఘనంగా మారుతిసాగర్ జన్మదిన వేడుకలు
భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు పేదలకు అన్నదానం, రోగులకు పండ్ల పంపిణీ నవగీతం, వేములవాడ: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-హెచ్ 143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జన్మదిన వేడుకలను బుధవారం వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మారుతి సాగర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో పేదలకు అన్నదానం చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు...