వేసవిలో ఊపందుకున్న పుచ్చకాయలు, పండ్ల వ్యాపారం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: వేసవి కాలం ప్రారంభమవడంతో పుచ్చకాయలు, మామిడి, ఖర్బూజా వంటి పండ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు, శరీరానికి చల్లదనం అందించేందుకు పండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో పట్టణాలు, గ్రామాల్లో పండ్ల వ్యాపారం రోజురోజుకు ఊపందుకుంటోంది. ముఖ్యంగా పుచ్చకాయల స్టాళ్లు రోడ్ల పక్కన కనిపిస్తూ వ్యాపారులకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఎండలు పెరగడంతో పెరిగిన డిమాండ్ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనాన్ని అందించే పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. పుచ్చకాయలు, ఖర్బూజా, మామిడి...