వేసవిలో త్రాగు నీటి కష్టాలు..పట్టించుకోని అధికారులు!

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని 3వ వార్డు సాయిరాం కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక చేతి బోరు పంపు నిరుపయోగంగా దర్శనమిస్తోంది.   ఏళ్ల తరబడి అందని మరమ్మతులు సాయిరాం కాలనీలో ఉన్న ఈ చేతి పంపు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోక తుప్పు పట్టిపోతోంది. ఒకప్పుడు కాలనీ వాసుల దాహార్తిని తీర్చిన ఈ బోరు పంపు, నేడు కేవలం ఒక ఇనుప ముక్కలా మిగిలిపోయింది. వర్షాకాలం, శీతాకాలం గడిచినా పట్టించుకోని యంత్రాంగం, ఇప్పుడు ఎండలు మండిపోతున్నా కూడా పట్టించుకోవడం లేదని స్థానికులు...