వేసవి సెలవులకు కొత్త దిశ…పోరుమల్లలో కరాటే క్యాంప్ ప్రారంభం…
నవగీతం,కోరుట్ల ప్రతినిధి వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో సమ్మర్ కరాటే క్యాంప్‌ను గ్రామ సర్పంచ్ గుయ్య అంజన్న ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కొలపాక సురేందర్ మాట్లాడుతూ, కరాటే శిక్షణ ద్వారా ఆత్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలని, విద్యార్థుల్లో మానసిక, శారీరక అభివృద్ధి సాధ్యమవుతుందని , సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించడమే కాకుండా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారడానికి, క్రమశిక్షణ అలవరచుకోవడానికి కరాటే ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రణయ్ రెడ్డి, గ్రామ...