navageetam.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 6:12 am Digital Edition : NAVAGEETAM

వైద్యం ఖర్చుల కోసం సాయం అందజేత

నవగీతం, కరీంనగర్:

కరీంనగర్ లోని డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ సెంటర్ లో ఆఫీసు అసిస్టెంట్ పని చేస్తున్న రాజు తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుండగా, ఆమెకు మెరుగైన వైద్యం కోసం సాయం అందించాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ పరిధిలోని పలువురు విద్యార్థులు తలో కొంత అందించారు. దీంతో సమకూరిన నగదును ఆదివారం నాడు కరీంనగర్ కోఆర్డినేటర్ కార్యాలయంలో కోఆర్డినేటర్ సత్య ప్రకాష్ చేతుల మీదుగా రాజుకు అందించారు. ఈ సందర్భంగా సత్య ప్రకాష్ పూర్వ విద్యార్థులు చాటుకున్న ఔదార్యాన్ని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కొమురయ్య, సత్యనారాయణ,రాములు తోపాటు కాలేజీ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు తాజోద్దీన్, లక్ష్మణ్, శ్రీకాంత్, అభినవ్, అలేఖ్య, మమత, గౌతమి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజు తల్లి త్వరగా కోలుకోవాలని విద్యార్థులు ఆకాంక్షించారు.