వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి.
ప్రభుత్వ ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి నవగీతం, జగిత్యాల/ధర్మపురి: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశానుసారం ప్రజల ఆరోగ్య సౌకర్యార్థం ధర్మపురి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారంధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి స్వయంగా సందర్శించి ఆసుపత్రి పనితీరును పరిశీలించారు.వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రిలోని ప్రయోగశాలలు (ల్యాబ్‌లు), వైద్యుల హాజరు, వైద్య పరికరాలు, మందుల నిల్వలు, ఆసుపత్రి సిబ్బంది పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు....