వైభవంగా శ్రీలక్ష్మీ నృసింహస్వామి కల్యాణం
నవగీతం,జగిత్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నల్లగొండ ప్రాచీన శ్రీ లక్ష్మీనృసింహస్వామి స్వయంభూ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు కంజర్ల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా సాగింది. ముందుగా ఆలయ పండితులు, అధికారులు స్వామివారిని ఆలయ బయటనున్న కమాన్ నుండి కళ్యాణ ప్రాంగణం వరకు ఉత్సాహభరితంగా ఎదుర్కొలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కళ్యాణ వేదికపై భక్తుల గోవింద నామస్మరణల నడుమ అర్చక పండితులు స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా...