వైభవంగా సార్గమ్మ–నీర్గమ్మ విగ్రహాల పునఃప్రతిష్ట
నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో సార్గమ్మ, నీర్గమ్మ దేవతల విగ్రహాల పునఃప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గతంలో కర్రతో తయారు చేసిన ఈ దేవతల ప్రతిమలు కాలక్రమేణా శిథిలావస్థకు చేరడంతో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కొత్తగా శిలావిగ్రహాలను తయారు చేయించారు. అనంతరం చెప్యాల గ్రామానికి చెందిన బైండ్ల పూజారుల చేతుల మీదుగా పునఃప్రతిష్ట నిర్వహించారు.ఈ సందర్భంగా విగ్రహాలను పూర్వపు ఆంజనేయస్వామి ఆలయం. కుమ్మరి సంఘం పెద్దమనిషి ఇంటి వద్ద నుంచి ప్రధాన బోనంతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు....