navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 6:47 pm Digital Edition : NAVAGEETAM

వైరా మండల విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చావా శ్రీనివాసరావు

నవగీతం :వైరా ప్రతినిధి

ఖమ్మం జిల్లా వైరా మండల వనరుల కేంద్రంలో నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించి రిజిస్టర్ లో తొలి సంతకం చేసిన శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను పాఠశాలలో మంచిగా అమలయ్యే విధంగా చూసి ఉపాధ్యాయులను కార్యోన్ముఖులను చేసి విద్యాభివృద్ధిలో ముందు ఉండటం కోసం ప్రయత్నిస్తానని తెలిపారుఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నంబూరు కనకదుర్గ, గరికపాడు ప్రధానోపాధ్యాయులు డి సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు పిఆర్టియు వెలిశెట్టి నరసింహారావు, వేమిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, యుటిఎఫ్ భాస్కరరావు సుధాకర్, టిపిటిఎఫ్ విజయ్ నాగేశ్వరరావు, ఎస్ టి ఎఫ్ పెనుగొండ ఉపేందర్ రావు ఎస్టియు కరుణాకర్ రావు మరియు ఉపాధ్యాయులు, ఎంఆర్సి స్టాప్ పాల్గొన్నారు