వైరా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం

3 ప్రభుత్వ కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణ నవగీతం,వైరా: ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలకు అధికారులు సర్వం రంగం సిద్ధం చేశారు. మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల నామినేషన్లను మూడు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వీకరించనున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించి ఏడుగురు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. మొత్తం 20 వార్డులను ఏడు భాగాలుగా విభజించి అధికారులను కేటాయించారు. 1,2,3 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా కే.రమేష్ రాజు, 4,5,6 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా ముళ్ళపూడి...