వైరా మున్సిపాలిటీలో నెలకొన్న ఉత్కంఠకు తెర
వైరా మున్సిపాలిటీలో కలిసి పోటీ చేయనున్న సిపిఐ(ఎం), బిఆర్ఎస్ నవగీతం, వైరా వైరా మున్సిపాలిటీ ఎన్నికల గురించి గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలో జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్, సిపిఐ(ఎం) పార్టీల పొత్తు ఖరారైంది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో వైరా మున్సిపాలిటీలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆదివారం జరిగిన చర్చల్లో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. ఆదివారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్...