శంకర్ గౌడ్ ఆత్మబలిదానం కలచివేసింది: డాక్టర్ రఘు చిట్నేని
కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వం వెంటనే స్పందించాలి నవగీతం, మెట్ పల్లి ప్రతినిధి: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ వైద్యుడు, సామాజిక సేవకుడు డాక్టర్ రఘు అన్నారు. హక్కుల సాధన కోసం పోరాడుతున్న ఒక కార్మిక బిడ్డను కోల్పోవడం యావత్ సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం...