శంషాబాద్ లో వన మహోత్సవం
మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్,ఆగస్టు 25,(నవగీతం):శంషాబాద్ పరిధిలోని ఆర్బీనగర్ లో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై,పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటం మనందరి బాధ్యత అని గుర్తుచేశారు.ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు,భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు హరితహారం,వన మహోత్సవం లాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు మరియు ఆర్బీ నగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.