శ్రీవారిని దర్శించుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దంపతులు

నవగీతం,జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఆయన కుటుంబసమేతంగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన సతీమణి రాధిక స్వామి వారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, జగిత్యాల జిల్లా మరింత అభివృద్ధి చెందాలని వారు శ్రీవారిని ప్రార్థించారు.