శ్రీవారి చక్రస్థానంలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
ఆనవాయితీగా గోదావరి నదిలో శ్రీవారి చక్రస్నానం నవగీతం,మల్లాపూర్ రాష్ట్ర ప్రభుత్వ నుండి రానున్న గోదావరి పుష్కరాలకు అత్యధికంగా కోరుట్ల నియోజకవర్గంకు నిధులు కేటాయించేలా కృషి చేస్తానని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం మల్లాపూర్ మండలంలోని కొత్త దాంరాజ్ పల్లి గోదావరినది తీరంలో నిర్వహించిన శ్రీవారి చక్రస్నానం కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు.ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ధనుర్మాస ఆరంభం నుండి కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనాదిగా శ్రీ గోదాదేవి...