navageetam.com
Newspaper Banner
Date of Publish : 30 December 2025, 5:27 am Digital Edition : NAVAGEETAM

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

నవగీతం, జగిత్యాల

వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దంపతులు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ఆరాధనలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పరిసరాల్లో చేపట్టిన ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దంపతులు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లాలో ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, సమగ్ర అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు.