శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణకట్ట ప్రారంభం
నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల చిరకాల వాంఛ నెరవేరింది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్మాణ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణకట్టను సోమవారం ఉదయం ప్రారంభించారు. మొక్కుల చెల్లింపు ఇక సులభతరం భక్తులకు ఈ కళ్యాణకట్ట అందుబాటులోకి రావడంతో గొప్ప ఊరట లభించింది. ఇకపై భక్తులు తమ తలనీలాల మొక్కులను క్రమబద్ధమైన పద్ధతిలో, పరిశుభ్రమైన వాతావరణంలో సమర్పించుకోవచ్చు. ఈ సౌకర్యం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తొలి మొక్కులు సమర్పించిన అయ్యప్ప స్వాములు శబరిమల...