navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 9:44 am Digital Edition : NAVAGEETAM

శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి:

మల్లాపూర్ మండలం లోని రేగుంట గ్రామంలో  శ్రీ సత్య హాస్పిటల్స్ సౌజన్యంతో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్ అందె ఉదయ్ కుమార్, డాక్టర్ చొల్లంగి స్వేత లు సుమారు 150 మందికి  వైద్య పరీక్షలు బిపి, షుగర్, ఈసిజి  జరిపి సంబంధిత మందులు అందజేసి వైద్య సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ..ఎండ తీవ్రత అధికంగా వున్నందున మద్యాహ్నం సమయంలో బయటకు రాకుడదని వడ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఏప్పుడు నీరు, పండ్ల రసాలు త్రాగుతూ ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లటి, నీడ ప్రదేశంలోకి తీసుకెళ్లాలని, మెలకువలో ఉంటే మజ్జిగ గాని, ఓఆర్ఎస్ ద్రావణం గాని తాగించాలన్నారు. చల్లటి నీటితో ముఖం కడగాలని సకాలంలో ఆసుపత్రికి తరలించాలని అన్నారు. వైద్యానికి రోజురోజుకీ ఖర్చులు పెరుగుతున్న ఈరోజుల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి సేవలందించడంపై గ్రామస్థులు అభినందిస్తూ డాక్టర్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తీట్ల రాజేష్, గనవేని మల్లేష్, కత్తి నరేష్, బైర ఎల్లయ్య, తిప్పవేని సుధాకర్, స్వామి, బైర స్వామి, పొన్నం సంతోష్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.