దాదాపు 8 నుండి 10 లక్షల ఆస్తి నష్టం..
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జగిత్యాల పట్టణంలోని స్థానిక మోచి బజార్ 40 వ వార్డులో గల రాచర్ల గంగాధర్ కు చెందిన పెంకుటి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురైఅగ్నికి ఆహుతి అయింది.ఈ ప్రమాదంలో ఐదు లక్షల వరకు కుట్టు మిషన్లు, మరియు ఇతర సామాగ్రి కాలి బూడిదవ్వగా దాదాపు8 నుండి 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు..ఈ ప్రమాదం సంభవించిన సమయంలో ఉదయం కావడం వలన ఇంట్లో ఎవరూ లేకపోవడం వలన ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు అందువలన పెద్ద ప్రమాదం తప్పింది.. లేకపోతే ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం తోపాటు ప్రాణం నష్టం జరిగేది అని బాధితుడు వాపోతున్నాడు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నాడు.. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం జరిగిన వీధిలోకి కనీసం ఫైర్ ఇంజన్ కూడా పోయే విధంగా రోడ్డు వెడల్పు లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం…

ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.. అడువాల జ్యోతి..
ఇదిలా ఉండగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి వారిది నిరుపేద కుటుంబం కావున తక్షణమే ఆర్థిక సహాయం అందించాలి.. అని మాజీ మున్సిపల్ చైర్ పర్ ,స్థానిక కౌన్సిలర్ అడవాల జ్యోతి అన్నారు.. బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహాయం అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఆమె బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు..
