navageetam.com
Newspaper Banner
Date of Publish : 14 January 2026, 11:29 am Digital Edition : NAVAGEETAM

సపాయి కార్మికుల సేవలు అమోఘం.

నూతన వస్త్రాలు పంపిణీ చేసిన

మార్గం నరేష్

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామపంచాయతీ  సపాయి కార్మికులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రముఖ సంఘ సేవకులు మార్గం నరేష్ కుమార్ నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు వారి కృషి వల్లే గ్రామము పరిశుభ్రంగా ఉంటుందని వారి సేవలు ఎంతో అమోఘమని వారిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య,ఏఎంసీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, అంతడుపుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు