సబ్ స్టేషన్ బ్రేకర్ పనులను పరిశీలించిన నాయకులు
నవగీతం,రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో లోవోల్టేజీ సమస్యను అధిగమించేందుకు బ్రేకర్ ఏర్పాటు గాను రూ. 4 లక్షల 72 వేలు మంజూరు కాగా అట్టి నిర్మాణపు పనులు చేపట్టగా ఏఎంసీ చెర్మెన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ తోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో రుద్రంగి గ్రామానికి లోవోల్టేజి సమస్య ఎక్కువ ఉండేదని, గ్రామంలో ఎక్కడైన చిన్న విద్యూత్ ఏర్పడితే మొత్తం కరెంటు నిలిపివేసి మరమ్మత్తులు చేపట్టేదని, దీంతో వ్యవసాయ రంగానికి...