సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడిగా గడ్డం హరీష్
నవగీతం,కోరుట్ల ప్రతినిధి: సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా గడ్డం హరీష్ నియమితులయ్యారు. కోరుట్ల పట్టణంలోని ఐ.బి. గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆదేశానుసారం, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు సమక్షంలో హరీష్‌ను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులుకు, కమిటీ సభ్యులకు హరీష్ కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచార...