సమిష్టి కృషితో పురోగతి సాధిద్దాం
అన్ని వార్డులను అభివృద్ధి చేసుకుందాం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి నవగీతం, మెట్ పల్లి : కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రజల సమిష్టి కృషితో పురోగతి సాధిద్దామని, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుందామని మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా గెలుపొంది తొలిసారిగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ లకు ఘన స్వాగతం పలికారు....