సర్ ప్రక్రియ లో ఏ ఒక్కరు ఓటు హక్కు కోల్పోకూడదు
నవగీతం, రాయికల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఏ ఒక్కరు ఓటు హక్కు కోల్పోకూడదు అని కొత్తపేట మాజీ ఉపసర్పంచ్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం గ్రామంలో జరిగిన సర్ సర్వే ను పరిశీలించి ఓటర్లకు సర్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఎన్యూమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపి ఇంటికి వచ్చినప్పుడు బిఎల్వో లకు అందజేయాలని తెలియజేశారు.