సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశం కొరకై దరఖాస్తుల ఆహ్వానం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 సంవత్సరానికిగాను డిగ్రీ మొదటి సంవత్సరంలో వివిధ గ్రూపుల్లో(ఇ/మీ)ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. గునుక శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు.అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) పరీక్ష 2026లో ఉత్తిర్ణత సాధించి ఉండాలి.గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్ష యాభైవేలకు మించకూడదు. పట్టణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. రెండు లక్షలకు మించకూడదు. కోర్సుల వివరాలు: ...