సింగపూర్ ,ఆగస్టు9,(నవగీతం)(బూన్‌లే పార్క్, జురాంగ్ రీజినల్ ఏరియా):గత 21 ఏళ్లుగా గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు సేవలందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న వాసు గల్ఫ్ ప్రైమ్ జర్నలిస్ట్, ఏ పిఎన్ ఆర్ టి గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్ వాసుదేవరావు ని సింగపూర్‌లో ఘనంగా సన్మానించారు.ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని పాలవలస పి ఎస్ ఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో పి ఎస్ ఐ బాబూరావు మరియు ఆయన బృంద సభ్యులు ఏర్పాటు చేశారు. సింగపూర్‌లోని కార్మిక సోదరులు, తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాసుదేవరావు ని అభినందించారు.ఈ సందర్భంగా పి ఎస్ ఐ బాబూరావు మాట్లాడుతూ..వాసుదేవరావు గల్ఫ్ దేశాల్లో గత 21 ఏళ్లుగా ప్రవాస భారతీయుల కోసం చేస్తున్న సేవలు అత్యంత అభినందనీయమని తెలిపారు. ఆయన తన సేవల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందుతూ ప్రస్తుతం ఏ పిఎన్ ఆర్ టి గల్ఫ్ రీజినల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించడం జిల్లా వాసులకు గర్వకారణమని పేర్కొన్నారు.వాసుదేవరావు మాట్లాడుతూ.. సింగపూర్‌లో బూన్‌లే పార్క్, జురాంగ్ రీజినల్ ఏరియాలో తనకు కార్మిక సోదరులు, పీ ఎస్ ఐ బాబూరావు మరియు బృందం ఇంత ఆత్మీయంగా సన్మానం చేయడం ఎంతో ఆనందంగా,గర్వంగా ఉందన్నారు. తనపై చూపిన ప్రేమ, ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సింగపూర్‌లోని పలువురు ప్రవాస భారతీయులు, కార్మిక సోదరులు పాల్గొని వాసుదేవరావు కి శుభాకాంక్షలు తెలిపారు.
