navageetam.com
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 6:02 pm Digital Edition : NAVA GEETAM

సింగపూర్ విద్యావిధానంపై అధ్యయనం చేసిన ఎంఈఓ మధుకు ఘన సన్మానం

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 (నవగీతం):

సింగపూర్ దేశ విద్యావిధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ పర్యటనకు వెళ్లిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బృందంలో ఇబ్రహీంపట్నం మండల ఎంఈఓ బండారి మధు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సింగపూర్‌లో అమలవుతున్న విద్యా విధానాలు, విద్యార్థులకు బోధిస్తున్న పద్ధతులు, ఉపాధ్యాయుల బోధనా తీరు, విద్యార్థుల అభ్యసన విధానాలను ఎంఈఓ మధు క్షుణ్ణంగా పరిశీలించారు. అభివృద్ధి చెందిన సింగపూర్ విద్యా వ్యవస్థలోని ఆధునిక విధానాలు, బోధనా పద్ధతులపై అధ్యయనం చేసి తిరిగి వచ్చిన సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బండారి మధును ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పవన్, తిరుపతి, శ్రీనివాస్, నారాయణ, అశోక్, సురేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.