navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 11:41 am Digital Edition : NAVAGEETAM

సిధారెడ్డి కి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు

నవగీతం, హైదరాబాద్:

తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం లభించడం పట్ల, సిధారెడ్డి కి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి రాసిన “అనిమేష” కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. సిధారెడ్డి కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంవల్ల తనకు సమాజంపట్ల ఉన్న నిబద్ధతను, అలాగే తనలోనున్న ఆర్ద్రతను తెలియజేస్తుందని, వారు గొప్ప మానవతావాదని అన్నారు. సిధారెడ్డి సుదీర్ఘ సాహిత్య కృషికి లభించిన గౌరవమని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల్లో చైతన్యం నింపడంలో వారు పోషించిన పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆధునిక తెలుగు కవిత్వంలో నందిని సిధారెడ్డి ఎన్నో పరిశోధనాత్మక రచనలతో సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాహితీ రంగంలో సిధారెడ్డి మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు