సిధారెడ్డి కి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు

నవగీతం, హైదరాబాద్: తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ 2025 పురస్కారం లభించడం పట్ల, సిధారెడ్డి కి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిన కవి నందిని సిధారెడ్డి రాసిన “అనిమేష” కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు. సిధారెడ్డి కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాలను, మానవ సంబంధాల విచ్ఛిన్నతలను చిత్రీకరించడంవల్ల తనకు సమాజంపట్ల ఉన్న నిబద్ధతను, అలాగే...