navageetam.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 2:38 pm Digital Edition : NAVAGEETAM

సినీహీరో సాయి ధరమ్ తేజ్ కరీంనగర్ జిల్లా పర్యటన

నవగీతం,కరీంనగర్:

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు సాయి దుర్గా తేజ్ యువత జాతీయ అధ్యక్షులు కాసరాజు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం 10వ తేది ఉదయం 5గం: హైదరాబాద్ తన నివాసం నుండి బయలుదేరి సిద్దిపేట మీదుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుని అనంతరం 11 గం: జగిత్యాల జిల్లా లోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుని అనంతరం కరీంనగర్ మీదుగా హైదరాబాద్ కి చేరుకుంటారని కాస రాజు తెలిపారు.ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు సాయిధరమ్ తేజ్  అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.