నవగీతం, కోరుట్ల ప్రతినిధి:(వి.సంపత్)
కోరుట్ల సీఐ ని పలువురు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ కి పుష్పగుచ్చాన్ని అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. వారి వెంట కల్వకోట గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు అధ్యక్షులు గుగ్గిల రమేష్ విలయతాబాద్ గ్రామ సర్పంచ్ వేముల లింబాద్రి, తొంబారావు పేట సర్పంచ్ నల్ల గంగారెడ్డి, కట్లకుంట సర్పంచ్ సుమలత–రంజిత్ లు ఉన్నారు.ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా వారు అభినందించారు.