సీతారామాలయంలో సీతమ్మకు ‘ఓడి బియ్యం’

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల పట్టణంలోని స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం సీతమ్మ వారికి ఓడి బియ్యం సమర్పించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు సీతారాములకు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అర్చనలు నిర్వహించి, మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, ఆలయ ప్రాంగణంలో భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు.కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు...