సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: సీనియర్ సిటిజెన్ల సంక్షేమానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు ఆ సంఘాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. అనంతరం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ రూపొందించిన వయో...