సీపీ టీం వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో సీపీ టీం ఘన విజయం
నవగీతం, నిజామాబాద్ నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం సీపీ టీం వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ మ్యాచ్ లో పోలీస్ కమిషనర్ ఎలెవన్ టీం ఘన విజయం సాధించింది.టాస్ గెలిచిన పోలీస్ టీం బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. పోలీస్ టీం తరఫున ఎస్ఐ కిరణ్ పాల్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించి 96 పరుగులు...