సురేష్ ఆత్మరామ్ మహారాజ్‌కు భక్తులు ఘన స్వాగతం
నవగీతం,కొడిమ్యాల: కొడిమ్యాల మల్యాల మండలం కొండగట్టు అంజన్న క్షేత్రంలో గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు చిలుకూరు బాలాజీ దేవాలయ శివాలయ ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ బుధవారం కొడిమ్యాల మండల కేంద్రంలో పర్యటించారు. కొడిమ్యాలకు చెందిన భక్తుడు చెన్న దేవేందర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన వారి గృహానికి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన గురువుగారికి దేవేందర్ కుటుంబ సభ్యులు గ్రామ భక్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులు మహారాజ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పూలమాలలు వేసి ఆశీస్సులు తీసుకున్నారు. తమ...