navageetam.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 4:03 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సోదరభావంతో మెలగడమే రంజాన్ సందేశం

బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష.

నవగీతం, పెద్దపల్లి:

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి ప్రాంతంలో గల ఈద్గా వద్ద పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉష ఈద్గాను సందర్శించి,అక్కడ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్న ముస్లిం సోదరులను స్వయంగా కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు మత సామరస్యానికి గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు.నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి,లోక కల్యాణం కోసం ప్రార్థనలు చేయడం అభినందనీయమన్నారు.గంగా-జమునా తెహజీబ్‌కు నిలయమైన మన ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెలుగుతూ పండుగలు జరుపుకోవడం ఆనందదాయకమని,ఈ పండుగ జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు అలువాల రాజేందర్,ఎండి.మాలిక్, బీఆర్ఎస్ నాయకులు మురుమూరి శేఖర్,గాజుల రమేష్,మెరుగు సాగర్,ఎనగందుల నిరంజన్ ఆముదాల అరుణ,మచ్చ రాహుల్, కల్వల చరణ్,అజీమ్, ఖలీల్, అబ్బు,రజనీకాంత్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.