navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 6:39 am Digital Edition : NAVAGEETAM

సోలార్ విద్యుత్ ప్లాంట్ కోసం స్థల పరిశీలన.

నవగీతం,మల్లాపూర్:

మల్లాపూర్ మండలం లోని గుండంపల్లి గ్రామంలో సహకార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న సోలార్ పవర్ ప్లాంట్ కు మంగళవారం నాడు అధికారులు స్థల పరిశీలన చేశారు. జిల్లా సహకార అధికారి సిహెచ్. మనోజ్ కుమార్, మెట్ పల్లి రెవిన్యూ డివిజన్ అధికారి నర్సింహ రావు, రెడ్కో జిల్లా మేనేజర్ దురిశెట్టి మనోహర్ లు ఇందులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి కుసుమ్ ప్రాజెక్ట్ లో భాగంగా సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా అధికారులు స్థల పరిశీలన చేశారు. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఈ స్థలం అనువైనదని అధికారులు అభిప్రాయ పడ్డారు. సహకార శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ కేంద్రానికి అవసరమైన భూమి కేటాయింపు కు తాము సిద్ధంగా ఉన్నామని రెవిన్యూ డివిజనల్ అధికారి తెలిపారు.