స్టేజీల మీద స్పీచ్‌లు.. ఆచరణలో దళితులపై అణచివేతలా ?

కోరుట్ల గడ్డపై రాజుకున్న రాజకీయ రణరంగం ఎమ్మెల్యే తీరును ప్రశ్నించిన కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణారావు నవగీతం ,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు రేగాయి. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావు నిప్పులు చెరిగారు. "స్టేజీ ఎక్కితే అంబేద్కర్ ఆశయాలు.. స్టేజీ దిగితే అహంకారపు పోకడలా?" అంటూ జువ్వాడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. అంబేద్కర్ జయంతి వేళ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ఫోజులిస్తున్న...